సినిమా పరిశ్రమలో చాలా మంది సినిమాల్లో నటించే క్రమంలో ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ఇక అందులో కొంత మంది మాత్రం వారి కోరిక తీరాక వదిలేస్తారూ..ఇంకొంత మంది మాత్రం జీవితాంతం వారితోనే ఉంటారు..


ఇక మరికొంతమంది ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వారి వ్యవహారాలను సాగిస్తూ ఉంటారు. కానీ అలాంటి వ్యవహారాలు ఎప్పటికైనా బయటపడక తప్పదు. ఇక ప్రస్తుతం హీరోయిన్ల పరిస్థితి ఇలాగే తయారైంది.జయం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది సదా . ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని ఆ తర్వాత వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో దూసుకుపోయిందట..


ఆ తర్వాత తన తెలివి తక్కువ తనం తో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేసుకొని బాడీకి ఏమాత్రం కూడా సూట్ అవ్వని సినిమాలను ఎంపిక చేసుకొని సినీ ఇండస్ట్రీలో తన గ్రాఫ్ పడిపోయేసరికి తన చేతులారా తానే తన సినీ కేరియర్ ని నాశనం చేసుకుంది. అయితే అప్పట్లో ఓ సారి కోలీవుడ్లో సదా కి భారీ ఆఫర్ వచ్చిందట. దాంతో ఆ ఇండస్ట్రీలోకి చెక్కేసింది సదా. అయితే ఆ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోతో పరిచయమై వరుస అవకాశాలు అందుకుని దాంతో కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయిందట.. ఇక ఈ నేపథ్యంలోనే ఆ కోలీవుడ్ స్టార్ హీరో పై సదా మనసు పడింది. అతనితో సినిమాల్లో నటిస్తున్న టైంలోనే అతని మాయలో పడిపోయిందట సదా. ఇక హీరో కూడా ఆమె అందానికి మంత్రముగ్దుడయ్యాడు.


ఇక వీరిద్దరూ తెరమీద సినిమాలో నటించేటప్పుడు రొమాన్స్ లో మునిగిపోయి నటించే వారట. ఇక కొన్ని రోజులకు ఆ హీరో ఇండస్ట్రీలో వస్తున్న కొత్త కొత్త అందాలకు టెంప్ట్ అయ్యి సదా ని దూరం పెట్టాడట. అయితే ఆ విషయం గురించి సదాహీరో ని నిలదీసి అడిగితే.. నేను ఎప్పుడు నిన్ను ఆ ఉద్దేశంతో అయితే చూడలేదు.. నువ్వు నాకు చెల్లి లాంటి దానివి అంటూ చెప్పాడట. ఇక ఆ మాట అన్నందుకు సదా కి చెప్పుతో కొట్టాలి అనిపించేంత కోపం వచ్చిందట. కానీ అతను స్టార్ హీరో కావడంతో ఆ వార్త బయటకు రాలేదు. ఇలా సదా మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్స్ హీరోల చేతిలో మోసపోయిన వాళ్లే ఉన్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: