యంగ్  బ్యూటీ హేబా పటేల్.అందాల ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వరుసగా క్రేజీ ఫొటోషూట్లతో మతిపోగొడుతున్న కుమారి.. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది.
కుమారి 21ఎఫ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ హేబా పటేల్. రాజ్ తరుణ్ సరసన నటించిన హేబా ఈ చిత్రంలో ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. దెబ్బకు యూత్ లో యమా క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లను అందుకుంది.

కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో కలిసి రాలేదు. తెలుగు అవకాశాల విషయంలో కాస్తా వెనకపడింది. తెలుగులో చివరిగా 'రెడ్'లో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. రీసెంట్ గా 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రంతో ప్రేక్షకుల ను అలరించింది. మళ్లీ ఇండస్ట్రీలో దూసుకుపోతోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటోంది. మరింత క్రేజ్ సంపాదించుకునేందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. గతంలోనూ హేబా పటేల్ నెట్టింట తన అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉండేంది. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగగత విషయాలను పంచుకునేది.

మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ ఉంటుంది. ఆ పొటోలను ఇంటర్నెట్ లో వదులుతూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను పంచుకుంది. ఈ పిక్స్ లో హేబా పటేల్ ట్రెడిషనల్ లుక్ ను సొంతం చేసుకుంది.

అలాగే, కూర్చిలో హాట్ సిట్టింగ్ పొజిషన్ లో మతిపోగొట్టింది. బిగుతైన దుస్తుల్లో ఎద అందాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ ఊపిరాడకుండా చేస్తోంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ క్రేజీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. లైక్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ప్రస్తుతం హేబా కేరీర్ మళ్లీ దారిలోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. చివరిగా 'ఓదెల రైల్వే స్టేషన్'తో అలరించిన హేబా.. ఇప్పుడు తమిళం, తెలుగులో కలిపి నాలుగైదు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో 'శాసన సభ', 'తెలిసినవాళ్లు', 'గీత', తమిళంలో 'వల్లన్', 'ఆద్య'లో నటించింది. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: