తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కున్న హీరోలలో ఒకరు అయిన దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా తమిళ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దళపతి విజయ్ ఇప్పటికే తాను నటించిన అనేక సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే దళపతి విజయ్ ఈ సంవత్సరం బీస్ట్ అనే మూవీ తో ప్రేక్షకులను ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా , పూజా హెగ్డేమూవీ లో దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కి తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం ,  హిందీ భాషల్లో విడుదల అయ్యి ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో మెప్పించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దళపతి విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు.  ఈ మూవీ తమిళ్ లో తెరకెక్కుతూ ఉండగా తెలుగు లో కూడా ఈ మూవీ ని విడుదల కాబోతోంది.

ఇప్పటికే ఈ మూవీ ని తమిళ్ లో వరసు పేరుతో విడుదల చేయనున్నట్లు , తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా  ప్రకటించింది. ఈ మూవీలో దళపతి విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ను ఈ దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించాడు. కాకపోతే ఈ మూవీ నుండి ఫస్ట్ సింగల్ సాంగ్ ను ఈ దీపావళి కి విడుదల చేయడం కష్టమే అని ఒక వార్త వైరల్ అవుతుంది. వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: