మెగా కాంపౌడ్ లోని అమ్మాయిలు కూడా ఇప్పుడు నిర్మాతలుగా రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తండ్రి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించడంతో పాటు నిర్మాతగా మారి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ వెబ్ సీరిస్ ను నిర్మించింది ఈ మెగా డైరెక్టర్

ఆ తర్వాత ‘సేనాపతి’ అనే సినిమాను ఓటీటీ కోసం ప్రొడ్యూస్ కూడా చేసింది. అలానే ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే మూవీనీ  కూడా నిర్మించింది. దీన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సరైన సమయం కోసం సుస్మిత కొణిదెల కొంతకాలంగా ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే… నాగబాబు కుమార్తె నిహారిక మాత్రం నిర్మాతగా అక్కను క్రాస్ చేసి ముందుకొచ్చేసింది మరి, నటిగా ఓ పక్క గుర్తింపు సంపాదించుకుంటూనే నిహారిక చిత్ర నిర్మాణంలోనూ పాలుపంచుకుంటోంది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లితో కలిసి ఆమె ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ మూవీ నిర్మించింది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 4న జనం ముందుకు  కూడా రాబోతోంది అంటా

  ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, ”ప్రభాస్ గారి చేతులు మీదగా ఈ నెల 25న ట్రైలర్ ను విడుదల చేస్తున్నాం. ప్రభాస్ అన్న ఫ్యాన్ గా ఇది నాకు చాలా ఎక్సయిటింగా వుంది. మేర్లపాక గాంధీ గారు ఇచ్చిన స్టోరీతో ‘ఏక్ మినీ కథ’ చేశాను. అది మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం మళ్ళీ చాలా ఆనందంగా వుంది. మా నిర్మాత వెంకట్ బోయనపల్లి గారికి కృతజ్ఞతలు. ఫరియా అబ్దుల్లా తో నటించడం చాలా హ్యాపీగా వుంది. బ్రహ్మజీ గారి పాత్రలోనే కాదు ఆయనతో షూటింగ్ లో కూడా చాలా ఫన్ ని ఎంజాయ్ చేశాం” అని చెప్పుకొచ్చారు. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, ” ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ జర్నీ ఒక అడ్వంచర్ లా జరిగింది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ కి చాలా థాంక్స్.l అంటూ, సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీ కి కూడా కృతజ్ఞతలు. బ్రహ్మాజీ తన పాత్రని చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా పట్ల చాలా ఎక్సయిటింగ్ వున్నాను. నా మొదటి సినిమా ‘జాతిరత్నాలు’ ని ఆదరించినట్లే ఈ సినిమాకి కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అని చెప్పింది.

మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ”ఇదో ఫన్ రైడ్ లాంటి సినిమా. మంచి అడ్వంచరస్, థ్రిల్ ట్రిప్ లా వుంటుంది. ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ మూవీని ఎక్కడా రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకట్ బోయనపల్లి గారికి కృతజ్ఞతలు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో ట్రావెల్ వ్లోగ్గేర్ గా కనిపిస్తారు, అందుకే ఈ చిత్రానికి ఈ టైటిల్ పెట్టాం. ఈ చిత్రంలో సెకండ్ లీడ్ గా చాలా కీలకమైన పాత్ర వుంది. అది బ్రహ్మజీ గారు చేశారు. ఈ పాత్రలో ఆయన్ని తప్పా వేరొకరిని ఊహించలేను. ఇది ఆయన చాలా డిఫరెంట్ అయినా రోల్. అలాగే సుదర్శన్, సప్తగిరి, నరేన్, మైమ్ గోపి ఇలా పెద్ద స్టార్ కాస్ట్ వుంది. ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుంది” అని అన్నారు. బ్రహ్మజీ మాట్లాడుతూ, ”’శ్యామ్ సింగారాయ్’ తీసిన వెంకట్ బోయనపల్లి గారు ఈ సినిమా తీసున్నారంటే ఈ కథ ఎంత బావుంటుందో  మనం అర్ధం చేసుకోవచ్చు. చాలా క్యాలిటీ వున్న సినిమా తీశారు. ఇందులో మనసుకు నచ్చిన పాత్ర చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు ప్రతి పదేళ్ళకు మంచి బ్రేక్ ఇచ్చే పాత్ర వస్తుంటుంది. అలాంటి బ్రేక్ వచ్చే పాత్రని ఇందులో చేశాను”’ అని అన్నారు. నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. ”సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా గొప్పగా తీశారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా గొప్పగా ఫెర్ ఫార్మ్ చేశారు అని డైరెక్టర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: