20 ఏళ్లక్రితం హీరోయిన్ నగ్మా అంటే టాలీవుడ్ జనాలకు విపరీతమైన పిచ్చి. ఎందుకంటే అప్పట్లో నగ్మా తన అందచందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపింది మరి. ఈమె తల్లిదండ్రులు నగ్మా చిన్నప్పుడే విడాకులు తీసుకోవడంతో చాలా చిన్న వయసులోనే నగ్మా బలవంతంగా ఇండస్ట్రీలోకి వచ్చింది.

అంతేకాదు హీరోల ముందు నగ్మా ఏజ్ చాలా తక్కువ కనిపించడంతో బలవంతంగా ఆమెకు స్టెరాయిడ్ లు కూడా ఇచ్చి ఆమె బాడీలో మార్పు వచ్చేలా చేసేవారని అప్పట్లో కొన్ని వార్తలు  కూడా వచ్చాయి. అంతేకాదు ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా నరకం చూసిందని చాలా వార్తలు కూడా వచ్చాయి. అయితే అప్పట్లో ఈమె స్టార్ హీరోయిన్ దివ్యభారతి కి ఫ్రెండ్ కావడంతో దివ్యభారతి తనకు వచ్చిన సినిమాల్లో కొన్ని సినిమాలకు నగ్మాని హీరోయిన్ గా తీసుకోమని సలహా ఇచ్చేదట ఈ నటి

దివ్యభారతి వల్ల నగ్మా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే మంచి మంచి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని తక్కువ టైమ్ లోనే  పెద్దా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత కోలీవుడ్ కి కూడా వెళ్లి అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకొని అక్కడ కూడా ఓ ఊపు ఊపింది. అయితే నగ్మా తన జీవితంలో చాలామంది తో అఫైర్స్ పెట్టుకుంది అనే వార్తలు ఇప్పటికి కూడా  తెగ వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె కోలీవుడ్లో చేస్తున్నప్పుడు హీరో శరత్ కుమార్ అంటే చాలా పిచ్చట.దాంతో ఆ హీరో ను పెళ్లి కూడా చేసుకుందామని అనుకుందట.కానీ శరత్ కుమార్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో అతనికి దూరమైంది ఈ బ్యూటీ

ఆ తర్వాత భోజ్ పూరి హీరోలైన మనోజ్ తివారి, రవి కిషన్ సింగ్, అలాగే మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తో కూడా ఆమె ప్రేమ వ్యవహారాలు నడిపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక నగ్మాతో అప్పట్లో సినిమాలు చేసేందుకు చాలా మంది స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపించేవారు. అంతేకాదు ఖచ్చితంగా తమ సినిమాలో నగ్మా హీరోయిన్ గా ఉండాలని పట్టుబట్టే వారట. ఇక అలా నగ్మా నాగార్జున కంట్లో పడింది మరీ. దాంతో నగ్మా తో ఎలాగైనా ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చేయాలని నాగార్జున  గారు నిర్ణయం తీసుకున్నాడట. అంతేకాదు కిల్లర్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా కావాలని దర్శక నిర్మాతలను  తెగ ఒత్తిడి చేసి మరీ ఆమెను సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే గతంలో హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి నాగార్జున తెగ ఆరాట పడే వాడని అప్పట్లో వార్తలు కూడా తెగ వచ్చాయి. దాంతో నగ్మా తో కూడా అలానే అనుకొని ఆమెను బలవంత పెట్టి మరి సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారట మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: