ప్రస్తుతం కాంతర సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో వసూళ్లతో  దుమ్ము దులుపుతుంది అన్న విషయం తెలిసిందే  మొదట కేవలం కోలీవుడ్లో మాత్రమే విడుదలై హిట్ సాధించిన ఈ సినిమాను తర్వాత అన్ని భాషల్లో విడుదల చేయగా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ సాధించింది అని చెప్పాలి. కేవలం 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాల పంట పండించింది. విడుదలైన ప్రతి భాషలో కూడా సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది కాంతారా సినిమా.  ఇక ఈ సినిమాకు దర్శకుడిగా, హీరోగా పనిచేసిన రిషబ్ శెట్టి పేరు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇలా ఒక్కసారిగా రిషబ్ శెట్టి తెరమీదకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోవడంతో ఈయన గురించి తెలుసుకోవడానికి అటు సినీ అభిమానులు అందరూ కూడా కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. కాంతారా సినిమా దర్శకుడు అయినా వ్యక్తి అసలు పేరు రిషబ్ శెట్టి కాదట. ఆయన అసలు పేరు భాస్కర్ షెట్టి నట   ఆయన సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పేరును రిషబ్ శెట్టిగా మార్చుకున్నారు.. ఇక కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట.. సీరియల్స్ లో కూడా నటిస్తూ కెరియర్ని ముందుకు నడిపించారట.  దర్శకుడిగా  పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.


 ఆయన డైరెక్షన్లో వచ్చిన కొన్ని సినిమాలు జాతీయ అవార్డులను కూడా దక్కించుకున్నాయి. 2017 లో ప్రగతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఇటీవలే ఆయన దర్శకత్వం వహించి స్వయంగా హీరోగా నటించిన కాంతారా సినిమా పాన్ ఇండియా హిట్ సాధించడంతో ఆయన కెరియర్ కీలక మలుపు తిరిగింది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు రిషబ్ శెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: