ప్రముఖ తెలుగు న్యూస్స్ ఛానెల్ ఎన్టీవీ చైర్మన్‌ నరేంద్ర చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసిందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై నరేంద్రచౌదరి సన్నిహితవర్గాలు స్పందించాయి. నరేంద్రచౌదరికి ఈడీ నోటీసులంటూ కొన్ని ప్రసారమాధ్యమాల్లో ఒక రేంజ్ లో కథనలు వస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని వారు చెబుతున్నారు. నరేంద్ర చౌదరికి ఎలాంటి ఈడీ నోటీసులు రాలేదని ఇదంతా కొందరు కావాలనే చేస్తున్న తప్పుడు ప్రచారమని అంటున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసులో నరేంద్ర చౌదరికి ఈడీ నోటీసులు జారీ అయ్యాయని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.

దీనిపై NTV యాజమాన్యం, జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులు కూడా స్పందించారు. నరేంద్ర చౌదరీపై కావాలనే కొందరు పనిగట్టుకొని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని, అన్నారు. న్యాయబద్ధంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా దొంగచాటుగా దుష్ప్రచారాలకు చేస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 న్యూస్ ఛానెల్ గా నిలిపిన NTV అధినేత నరేంద్ర చౌదరీపై ఇలా కుట్ర పూరితంగా వ్యవహరించడం నేరమని అంటున్నారు.  ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఎంటీవీ భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో కోటి దీపోత్సవం నిర్వహిస్తూ అశేష భక్త జనానికి అరుదైన కానుక ఇస్తున్నారు నరేంద్ర చౌదరి. 2012 నుంచి నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు ఒక సంకల్పంగా కోటి దీపోత్స్వవాలను నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది లక్ష దీపోత్సవం ఏర్పాటు చేయగా తర్వాత ఏడాది నుంచి కోటి దీపోత్సవంగా మారింది. మహాదీపయజ్ఞంగా 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం అప్రతిహతంగా ఈ దీపోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది.  

కోటి దీపోత్సవం ఒక మహోద్యమంగా కొనసాగుతుంది.. ఈ ఏడాది కూడా అక్టోబర్ 31 నుంచి కోటి దీపోత్సవం ప్రారంభం అవుతుంది. అయితే నరేంద్ర చౌదరి ఆ పనుల్లో ఉండగా ఆయనకు ఈడీ నోటీసులు అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. కేవలం కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని భంగం కలిగించేందుకే ఇలాంటి వార్తలు రాస్తున్నారని. ఇలాంటి దుష్ప్రచారాల వల్ల దృడ సంకల్పాన్ని ఆపలేరని నరేంద్ర చౌదరి సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యక్రానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా ఈలోగా నరేందర్ చౌదరిపై ఈడీ నోటీసులు అంటూ న్యూస్ వైరల్ అవడం హాట్ న్యూస్ గా మారింది.    


మరింత సమాచారం తెలుసుకోండి: