మరో 50 రోజుల్లో వెండితెర అద్భుతం అవతార్ పార్ట్ - 2 విడుదల కాబోతోంది. ఈ సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా చాలా అంచనాలు అయితే ఉన్నాయి..

సినిమా ప్రేక్షకులు డిసెంబర్ 16 ఎప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా థియేటర్లు కూడా రూపొందుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రసాద్ ఐమాక్స్ లార్జ్ స్క్రీన్ ను ఆ సమయంలోగా కొత్త హంగులతో ముస్తాబు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఇక ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కోల్ కతా వంటి నగరాల్లో అత్యధిక కౌంట్ తో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఎగ్జిబిటర్లను సైతం అవతార్ ఫీవర్ పట్టేసిందట.మొదటిరోజు ఇండియాలో హాలీవుడ్ మూవీస్ అన్నింటిలోకి హైయెస్ట్ ఓపెనింగ్ తగ్గడం ఖాయమని అంచనాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి.

అవతార్ పార్ట్ 1 వచ్చి పుష్కరకాలం పూర్తయింది. అప్పటినుంచి ఈ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరున్ ఈ సినిమా సీక్వెల్ మీద పనిచేస్తున్నారు. నాకు సంబంధించి ఇంకొక మూడు భాగాలు సిద్ధం చేయబోతున్నారు. అంతకంటే ముందు పార్ట్ 2 ఫలితం కీలకంగా మారిందట.ఈ సినిమా నిడివి మూడు గంటల పది నిమిషాలు దాకా ఉంటుందని తెలుస్తోంది. మొదటి భాగం దీనికన్నా అరగంట తక్కువగా ఉంది. లెంత్ ఎంత ఉన్నా ప్రేక్షకులు ఆ పండోరా ప్రపంచంలో మునిగి తేలేందుకు సిద్ధంగా ఉన్నారు. మామూలుగా ఇంగ్లీష్ సినిమాలు గంటన్నర నుంచి రెండున్నర గంటలలోపే పూర్తవుతాయి. ఇదే జేమ్స్ కామెరూన్ తీసిన టైటానిక్ మాత్రమే సుదీర్ఘమైన నిడివి ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా విసిగించకుండా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన దక్కించుకుందట.ఇప్పటికీ ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు హార్ట్ బీట్ అంటే అతిశయోక్తి కాదు.డిసెంబర్ 2 లేదా మూడో వారంలో విడుదల
అవతార్ పార్ట్ 2 డిసెంబర్ మూడో వారం నుంచి విడుదల కాబోతున్న తెలుగు, తమిళ, హిందీ సినిమాల మీద ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. ఈ సినిమా విడుదలైన వారం తర్వాత ధమాకా, 18 పేజేస్, సర్కస్ లాంటి సినిమాలు చాలానే వస్తున్నాయట.. అవతార్ పార్ట్ 2 కు బ్లాక్ బస్టర్ వస్తే కనుక మిగతా సినిమాలు మాత్రం తట్టుకోవడం కష్టమే. దీనికి నెల ముందు వస్తున్న వాకండా అనే సినిమా పెద్ద హైపుతో రిలీజ్ అవుతున్నది. మరికొద్ది రోజుల్లో అవతార్ పార్ట్ 2 కు సంబంధించిన వ్యాపార లెక్కలు బయటకు రాబోతున్నాయి. అవి షాకింగ్ గా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారట... అసలే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న కంటెంట్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న రోజులు ఇవి. పార్ట్ 1 లోనే పండోరా గ్రహం ద్వారా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చిన కామెరూన్.. పార్ట్ 2 లో ఇంకా ఏం అద్భుతాలు చేశారో వేచి చూడాల్సి ఉంది. కంటెంట్ ఏ మాత్రం బాగున్నా కానీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం మాత్రం గ్యారెంటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: