తెలుగులో తమిళ హీరోలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటివరకు చాలామంది తమిళ హీరోలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేయగా వారిలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో కార్తీ సూర్య తమ్ముడుగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ తన మొదటి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించడం లో సఫలం అయ్యాడు. ఆ విధంగా తాజాగా కార్తీ సర్దార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది కూడా సంచలన విజయం అందుకోవడంతో కార్తీకి ఇప్పుడు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది అని చెప్పవచ్చు

ఖైదీ సినిమాతో అటు తమిళంలో ఇటు తెలుగులో మరొక స్థాయి హీరోగా ఎదిగిన కార్తీ డైరెక్టర్ తెలుగు సినిమా చేయాలనే డిమాండ్ బాగానే ఏర్పడింది. అంతకు ముందు నాగార్జున హీరోగా ఊపిరి అనే సినిమాలో కార్తీ తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయగా సోలో హీరోగా ఆయన సినిమా చేస్తే అందులోనూ ఒక యాక్షన్ ఎంత తేడా సినిమా చేస్తే బాగుంటుంది అనేది ఆయన అభిమానుల మాట. కేవలం తమిళ నేటివిటీ ఉన్న సినిమాను మాత్రమే కాదు అన్ని వర్గాల అన్ని భాషల ప్రేక్షకులకు తగ్గట్లుగా ఉన్న నేటివిటీని తన సినిమాలో చూపిస్తూ ఆ చిత్రాన్ని విడుదల చేస్తూ ఉంటాడు అందుకే ఆయనకు అన్ని వర్గాలలోను అన్ని భాషలలోనూ అభిమానులు ఉంటారు.

ఏదేమైనా తెలుగులో అగ్ర హీరోలతో సమానంగా డిమాండ్ ను మార్కెట్ ను ఏర్పరుచుకున్న కార్తి త్వరలో తెలుగులో ఒక భారీ దర్శకుడు తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. మరి ఆ అవకాశాన్ని ఏ దర్శకుడు అందుకుంటాడో చూడాలి. వంశీ పైడిపల్లి విజయ దళపతి తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు మరి కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఇప్పుడు తమిళ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఆ విధంగా ఈ హీరోతో సినిమా అవకాశాన్ని పొందే అదృష్టవంతుడైన దర్శకుడు ఎవరో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: