డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన చిత్రం లైగర్. ఈ చిత్రంలో హీరోయిన్గా అనన్య పాండే నటించింది. ఇక నిర్మాతలుగా చార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ వ్యవహరించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన భారీ డిజాస్టర్ గా చవి చూసింది. ఇక దీంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరి జగన్నాథ్ మధ్య వివాదాల వల్ల ఇప్పుడు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ డిస్టిబూటర్ల పై పూరి జగన్నాథ్ ఫిర్యాదు చేయడం సంచనాలంగ మారింది.


లైగర్ చిత్రానికి గాను నష్టపరిహారం కోరుతూ పూరి జగన్నాథ్ ఇంటిముందు ధర్నాకు దిగుతామని ఎగ్జిక్యూటర్లు సైతం హెచ్చరిస్తూ ఒక సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ మాట్లాడిన ఒక ఆడియో కూడా బయటికి రావడం ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ క్రమంలోనే నిన్నటి రాత్రి డిస్ట్రిబ్యూటర్ల పైన జూబ్లీహిల్స్ లో పోలీస్ స్టేషన్లో పూరి జగన్నాథ్ కేసు నమోదు చేయించినట్లుగా సమాచారం. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మరియు ఫైనాన్షియల్ శోభన్ బాబులు తన కుటుంబం పై దాడి చేయడానికి ఇతరులను హింసకు ప్రేరేపిస్తున్నారని పూరి జగన్నాధ్ తన ఫిర్యాదులో తెలియజేసినట్లు సమాచారం.



ప్రస్తుతం తాను కేవలం ముంబైలో ఉన్నానని.. నేను లేనప్పుడు తన కుటుంబాన్ని శారీరకంగా మరియు మానసికంగా వేధించి అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని తెలియజేశారు. ఇక ఒకరినొకరు కుమ్మక్కై నా నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని వరంగల్ శ్రీను, శోభన్ బాబులు వాట్సప్ ద్వారా నాపై డిస్ట్రిబ్యూటర్లను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని ఈ విషయం తెలియగానే నేను మీ దృష్టికి తీసుకువచ్చానని తెలియజేశారు పూరి జగన్నాథ్. ఇది తన నుండి చట్ట విరుద్ధమైన డబ్బు సేకరించేందుకే ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ వేధింపులకు చేస్తున్నారని కేసులో నమోదు చేసినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: