అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహారెడ్డికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సౌత్ స్టార్‌ల సతీమణులందరిలోనూ స్నేహారెడ్డి టాప్ ప్లేస్‌లో ఉంటుంది. మహేష్‌ బాబు భార్య నమ్రత, రామ్ చరణ్‌ భార్య ఉపాసన, సూర్య సతీమణి జ్యోతిక ఇలా ఏ స్టార్ హీరో తీసుకున్నా.. వారి వారి పార్ట్నర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న ఫాలోవర్ల కంటే బన్నీ భార్య ఖాతాకు ఉండే ఫాలోయింగ్ ఎక్కువ. ఈ రికార్డ్ కేవలం బన్నీ భార్యకు మాత్రమే సొంతమైంది. దాదాపు తొమ్మిది మిలియన్లకు దగ్గరగా స్నేహారెడ్డికి ఫాలోయింగ్ ఉంటుంది.

ఈ మధ్య బన్నీ భార్య చేస్తోన్న ఫోటో షూట్లు, మోడ్రన్ లుక్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. స్టార్ హీరోయిన్లను తలదన్నేలా ఫిట్ నెస్‌తో దూసుకుపోతోంది. బన్నీ తన భార్య మీద అప్పుడప్పుడు నాటీ కామెంట్లు కూడా చేస్తుంటాడు. బన్నీ, స్నేహాల మధ్య ఉండే చిలిపి సరసాన్ని నెటిజన్లు ఇష్టపడుతుంటారు. మెగా, అల్లు ఈవెంట్లలో ఏ పంక్షన్ జరిగినా కూడా ఈ జంటే హైలెట్ అవుతుంది. నిహారిక పెళ్లిలోనూ ఈ జంటే అందరినీ తమ వైపుకు తిప్పేసుకుంది.

అల్లు స్నేహారెడ్డి కోసం సమంత స్టైలీష్ట్ ప్రీతమ్, మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ పని చేస్తుంటారు. సమంత అవుట్ ఫిట్‌లు చూసుకునే ప్రీతమ్.. స్నేహారెడ్డికి పని చేస్తుంటాడు. ఇక ఇప్పుడు దివాళి సెలెబ్రేషన్స్‌లో భాగంగా స్నేహారెడ్డి కొత్తగా, మరింత అందంగా రెడీ అయింది. తన మేకోవర్‌కు సంబంధించిన వీడియోను, మేకప్ వీడియోను స్నేహారెడ్డి తాజాగా షేర్ చేసింది.
ఇందులో స్నేహారెడ్డి, బన్నీ, అల్లు ఫ్యామిలీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక బన్నీ భార్య అంటే ఆ మాత్రం ఉండాలంటూ నెటిజన్లు అంటున్నారు. నీయవ్వ తగ్గేదేలే అంటూ స్నేహారెడ్డిని ఆకాశానికిత్తేస్తున్నారు. స్నేహారెడ్డి వీడియోకు సాధన సింగ్ కామెంట్ పెట్టేసింది. ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకునేందుకు స్టన్నర్ రెడీ అవుతోందంటూ సాధన కామెంట్ చేస్తే.. నీకే థాంక్స్ చెప్పాలి అని స్నేహారెడ్డి రిప్లే ఇచ్చింది.

మొత్తానికి బన్నీ ఇంట్లో ఏర్పాటు చేసిన దివాళి సెలెబ్రేషన్స్‌లో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. ఈసారి రామ్ చరణ్‌, ఉపాసనలు జపాన్‌లో ఉండటంతో మిస్ అయ్యారు. అయితే ఈ వేడుకల్లో చిరంజీవి, నాగబాబు కూడా కనిపించలేదు. కానీ నిహారిక,సాయి ధరమ్ తేజ్ వంటి వారు సందడి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: