ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ సంధ్య గుర్తుందా ? అదేనండి పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలో చెల్లిగా నటించిన అమ్మాయి. తమిళ్ ఇండస్ట్రీ లో కాదల్ ( తెలుగులో ప్రేమిస్తే) సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
స్వతహాగా మలయాళీ అయిన సంధ్య తమిళ్ సినిమా నక్క తోక తొక్కినట్టు బాలాజీ శక్తివేల్ లాంటి దర్శకుడి చేతిలో పడింది. ఈ సినిమా సంధ్యకు మంచి తీసుకురావడమే కాదు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సైతం దక్కేలా చేసింది.

ఇక తమిళ కాదల్ సినిమా కోసం ఎంతో మంది హీరోయిన్స్ ని అనుకున్నప్పటికీ ఎవరు వర్క్ ఔట్ కాలేదు.
ఆ సమయంలో కెరీర్ పీక్ లో ఉన్న ఇలియానా ఈ పాత్రను రిజెక్ట్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ ని సైతం ఈ సినిమాతో హీరోయిన్ ని చేయాలని దర్శకుడు భావించిన అది కూడా జరగలేదు. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన శరణ్యని తొలుత హీరోయిన్ గా సెలెక్ట్ చేసి..కొంత బాగం షూటింగ్ అయిన తర్వాత హీరోయిన్ చాలా చిన్నగా కనిపిస్తుందని భావించిన దర్శకుడు చివరకు సంధ్యనే హీరోయిన్‌గా తీసుకున్నాడు.

ఇలా ఎంతో మంది చేతులు మారి చివరికి ఈ సినిమా సంధ్య చేతికి వచ్చింది. వచ్చిన మొదటి అవకాశాన్ని చక్కగా సద్వినయోగం చేసుకున్న సంధ్య ఈ సినిమాలో తన నటనతో జీవించింది. ఇక సంధ్యసినిమా తర్వాత చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది అని అంతా అనుకున్నప్పటికీ కేవలం 40 సినిమాలతోనే అమే కెరీర్ ముగిసిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన సంధ్య 2015 లో చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

అమే స్టార్ట్ హీరోయిన్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ సమయంలో ఎక్కువగా రొమాన్స్ విషయంలో అమే ఆంక్షలు పెట్టుకోవడంతో కొంత మేర ఆమెకు హీరోయిన్ అవకాశాలు ఇవ్వలేదు. మొదటి సినిమా హిట్ అయ్యాక అమే ఎవరు ఊహించని విధంగా తన రెండవ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది. దాంతో ఆమెకు ఎక్కువగా ఎలాంటి పాత్రలు రావడం మొదలయ్యాయి. తెలుగులో సైతం పవన్ కి చెల్లిగానే నటించింది. మూడవ సినిమా వల్లభన్ ( తెలుగులో వల్లభ). ఇది శింబు సినిమా ఇందులో సైతం అమే చిన్న రోల్ లోనే నటించింది.

ఆ తర్వాత అమే ఎక్కువగా మలయాళ చిత్ర పరిశ్రమ పైననే ఫోకస్ చేసింది. అలా 2016 వరకు అడపా దడపా నటిస్తూ వచ్చిన ఇప్పుడు మాత్రం తన టైం ఫుల్ గా ఫ్యామిలీ తోనే గడుపుతుంది. ఇక 2006 లో వల్లభన్ సినిమా షూటింగ్ టైంలో సంధ్య ఎంతో ఇబ్బంది పడిన విషయం.. ఆ తర్వాత 12 ఏళ్లకు బయటపెట్టడం సంచలనం సృష్టించింది. అసలు ఆ సినిమా షూటింగ్ లొకేషన్ ఎప్పుడు గందర గోళంగా ఉండేదట. 9 గంటలకు షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా 11 అయిన కూడా ఫస్ట్ సీన్ షూట్ చేసేవారు కాదట.

పైగా తనకు కథ మొదట ఒకటి చెప్పి షూటింగ్ టైంలో 99 శాతం కథను మార్చేసి దర్శకుడు షూట్ చేశాడట. సినిమా విడుదల అయినా తర్వాత అసలు తనకు చెప్పిన కథలో ఒక్క సీన్ కూడా అందులో లేదని ఆమె ఆరోపించింది.. శింబు లాంటి ఒక హీరో తనను ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని ఆ సినిమా యూనిట్ కి అసలు డిసిప్లిన్ అంటే ఎంటో తెలియదని తెలిపింది. శింబు లాంటి చెత్త మనిషిని నేను ఎక్కడ చూడలేదు అంటూ కూడా చెప్పడం అప్పట్లో తమిళ మీడియాలో పెను దుమారమే సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: