పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ చిత్ర యూనిట్ మొత్తానికి ఒక పీడ కలగా మారిపోయింది. ఈ చిత్ర పరాజయ భారం నుంచి బయట పడేందుకు పూరి ప్రయత్నిస్తున్న తరుణంలో ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ చిత్ర యూనిట్ మొత్తానికి ఒక పీడ కలగా మారిపోయింది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, ఛార్మి, అనన్య పాండే ఇలా ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయిన ఎవరిని వదలకుండా నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేశారు.

ఈ చిత్ర పరాజయ భారం నుంచి బయట పడేందుకు పూరి ప్రయత్నిస్తున్న తరుణంలో ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. లైగర్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు దారుణంగా నష్టాలు చవిచూశారు. వీరికి సాధ్యమైనంత అమౌంట్ సెటిల్ చేస్తానని పూరి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కానీ ఇంతవరకు పూరి జగన్నాధ్ తన మాట నిలబెట్టుకోకపోవడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పూరిపై పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎగ్జిబిటర్లు అంతా పూరి కి వ్యతిరేకంగా ధర్నా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పూరి జగన్నాధ్, ఛార్మి కూడా లైగర్ బిజినెస్ వల్ల పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆర్థిక సమస్యల వల్ల పూరి ముంబైలో అద్దెకి ఉంటున్న ఫ్లాట్ కూడా ఖాళీ చేశారు అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే ఎగ్జిబిటర్లు పూరిపై మరింతగా రెచ్చిపోవడానికి ఛార్మి నోరు జారడమే అనే ప్రచారం జరుగుతోంది.

ఒక పార్టీలో ఛార్మి లైగర్ బిజినెస్ గురించి ఒక పార్టీలో షాకింగ్ ఫాక్ట్స్ రివీల్ చేసిందట. అంతా అనుకున్నట్లు లైగర్ వల్ల తమకేమీ నష్టాలు రాలేదు అని.. థియేట్రీకల్ బిజినెస్, నా థియేట్రికల్ బిజినెస్ వల్ల తమకి కొన్ని కోట్ల లాభం వచ్చింది అని తెలిపిందట.

ఇది ఆనోటా ఈనోటా చేరి ఎగ్జిబిటర్స్ వరకు చేరిందట. దీనితో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పూరిపై మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా దారుణమైన నష్టాలు మిగిల్చినప్పుడు తమ నష్టాలని తగ్గించాలని బయ్యర్లు నిర్మాతలని డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాము. ఇటీవల ఆచార్య చిత్రం విషయంలో తాను 80 శాతం రెమ్యునరేషన్ వదులుకున్నట్లు చిరంజీవి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: