సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ కాబోయే సినిమాలకు సంబంధించి మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తుంటారు. స్టార్ హీరోల సినిమాల మేకింగ్ వీడియోలకంటే చిన్న సినిమాల మేకింగ్ వీడియోలు అప్పుడప్పుడు జనాలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్ సంబంధించి మేకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్, నందు జంటగా నటించిన సినిమా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. నవంబర్ 4న ఈ సినిమా రిలీజ్ కాబోతుండటంతో.. చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఓవైపు ట్రైలర్, సాంగ్స్ కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.ఈ క్రమంలో సినిమా రిలీజ్ దగ్గరపడటంతో రష్మీ, నందుల మధ్య ఓ రొమాంటిక్ సీన్ కి సంబంధించి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీన్ లో నందు, రష్మీ ఇద్దరూ యాక్టింగ్ లో లీనమైపోయి కనిపించారు. అయితే.. యాంకర్ రష్మీ ఈ స్థాయి రావడానికి ఎంత కష్టపడిందో అందరికి తెలుసు. ఓవైపు టీవీ యాంకర్ గా, మరోవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న రష్మీ.. షూటింగ్స్ లో చాలా కష్టపడటం మనం చూస్తుంటాం. తాజాగా ఈ రొమాంటిక్ సీన్ విషయంలో కూడా రష్మీ పడుతున్న కష్టాన్ని మనం చూడవచ్చు. యాక్టింగ్ అనేది ఈజీ అనుకునేవారికి ఈ వీడియో ఉదాహరణగా నిలుస్తోంది.

రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు లేదా సెంటిమెంట్, సాంగ్స్.. ఇలా ఏ సన్నివేశమైనా నటీనటులు పడే కష్టం మామూలుగా ఉండదు. ముఖ్యంగా యాంకర్ రష్మీ తన సినిమాలలో ఎంతో డెప్త్ గా నటిస్తుంటుంది. ఇప్పుడీ మేకింగ్ వీడియో చూస్తే.. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీలో కూడా ఎంతో చక్కగా చీరకట్టులో కనిపిస్తోంది. ఇక రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ బొమ్మ బ్లాక్ బస్టర్.. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రష్మీ హీరోయిన్ గా ‘గుంటూరు టాకీస్’ మూవీతో చివరి హిట్ అందుకుంది. సో.. ఈసారి హిట్ కొట్టి ఫామ్ లోకి రానుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: