నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉండగా , కీర్తి సురేష్మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే నాని మరియు కీర్తి సురేష్ కలిసి నేను లోకల్ మూవీ లో నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు ,  వీరిద్దరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి  నేను లోకల్ వంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత నాని మరియు కీర్తి సురేష్ కలిసి దసరా మూవీ లో నటిస్తున్నారు.

దసరా మూవీ ని సింగరేణి కార్మికుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక సాంగ్ ను కూడా విడుదల చేసింది. ఈ సాంగ్ లి కూడా నాని అదిరి పోయే ఉర మాస్ లుక్ లో ఉన్నాడు  అలాగే ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ప్రస్తుతం దసరా మూవీ షూటింగ్ హైదరాబాద్‌ లోని బాచుపల్లి ప్రాంతంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా వేసిన సెట్‌ లో కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. నాని కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ మూవీ లో పూర్ణ ప్రతి నాయక పాత్రలో కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే నాని ఆఖరుగా అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: