కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు లక్ష్మి , సిద్ధార్థ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు మూవీ లో ప్రతినాయక పాత్రలో నటించి , తన నటన తో తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. 

ఆ తర్వాత మంచు లక్ష్మి కేవలం ప్రతినాయక పాత్రలు మాత్రమే కాకుండా ఎన్నో డిఫరెంట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా మంచు లక్ష్మి ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో టీవీ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. అలాగే "ఓ టి టి" షో లకు కూడా హోస్ట్ గా వ్యవహరించింది. 

అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇలా సినిమాలతో , టీవీ షో లతో ,  "ఓ టి టి" షో లతో ,  వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎప్పటి కప్పుడు అలరిస్తూ వస్తున్న మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో టచ్ లోకి వస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు మంచు లక్ష్మి తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మీ తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మంచు లక్ష్మి తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లలో అదిరిపోయే లుక్ లో శారీ ని కట్టుకొని ,  స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి , అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: