రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తిరిగి సినిమా షూటింగ్ ల వైపు వెళ్ళాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటూ ఆ మూవీలో అతడి పాత్రకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ ను వీలైనంత త్వరలో పూర్తి చేసి తిరిగి రాజకీయ బాట పట్టాలని పవన్ భావిస్తున్నాడు.


ఈసినిమా పూర్తి చేసి తిరిగి మరో సినిమాను చేయాలి అన్న ఆలోచనల మధ్య పవన్ త్రివిక్రమ్ సలహాతో తమిళ మూవీ ‘వినోదయ శీతం’ రీమేక్ కు లైన్ క్లియర్ చేసిన విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి స్క్రిప్ట్ సంభాషణలు అన్నీ త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు. ఈసినిమా కోసం పవన్ నటించవలసి ఉన్న ‘భవధీయుడు భగత్ సింగ్’ మూవీని పక్కకు పెట్టాడు అని అంటారు.


త్రివిక్రమ్ సలహాతో గతంలో చేసిన ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ సినిమాలు హిట్ అవ్వడంతో ఈ రీమేక్ కూడ హిట్ అవుతుందని పవన్ నమ్మకం అంటున్నారు. అయితే ఈమధ్యనే దీపావళికి బాలీవుడ్ లో విడుదలై ఘోరమైన ఫ్లాప్ గా మారిన ‘థాంక్ గాడ్’ తమిళంలో విడుదలైన ‘వినోదయ శీతం’ కు రీమేక్. ఇప్పటికే బాలీవుడ్ లో ఫెయిల్ అయిన ఈసినిమా రిజల్ట్ తెలిసి కూడ పవన్ మళ్ళీ ఎందుకు ‘వినోదయ శీతం’ రీమేక్ వైపు ఆశక్తి కనపరుస్తున్నాడు అంటూ పవన్ అభిమానులు గగ్గోలు పెడుతున్నట్లు టాక్.


ఈసినిమాకు బదులు పవన్ హరీష్ శంకర్ కు అవకాశం ఇచ్చి ‘భవధీయుడు భగత్ సింగ్’ లో నటిస్తే రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు అతడి ఇమేజ్ మరింత పెరుగుతుంది అంటూ తమ అభిప్రాయాలను పవన్ దృష్టికి తెలియ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే పవన్ కు త్రివిక్రమ్ పై ఉన్న అపారమైన నమ్మకం అతడి అభుమానులు ఇచ్చే సూచనలు పట్టించుకునే దిశలో అడుగులు వేయకపోవచ్చు అన్న అభిప్రాయాలు కూడ ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి..



ReplyForward

మరింత సమాచారం తెలుసుకోండి: