బ్లూ కలర్ కళ్ళు, అందానికి అందం అందుకే మిస్ ఇండియా అయ్యింది..ఇంతకి ఆమె ఎవరా అని ఆలోచిస్తున్నారా?.. ఆమె ఐశ్వర్యరాయ్.. తెలుగు,హిందీ,తమిళ్ లో వరుస సినిమాలు చేసింది.. ఇప్పటికీ సినిమాలు చేసుకుంటూ పోతుంది.ఎంత వయస్సు వచ్చినా తరగని అందం ఆమె సొంతం.. అందుకే ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చి పడుతున్నాయి.డాక్టర్ అవ్వాలనుకుంది..కానీ మోడల్‌గా మారింది. అందాల పోటీల్లో మెరుపులా మెరిసి విశ్వ సుందరిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తన నటనతో వెండితెరపైనా కోట్లాది మందిని మెప్పించింది ఐశ్వర్యరాయ్.


కేవలం కళ్లతో మనసు దోచుకునే హీరోయిన్ ఐశ్వర్య రాయ్.. దేవదాస్, ధూమ్ 2, జోధా అక్బర్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, రోబో, రావణ్, ప్రియురాలు పిలిచింది, సర్కార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఐశ్వర్య రాయ్ ఖాతాలో ఉన్నాయి. అభిషేక్ బచ్చన్‌తో కలిసి ధూమ్ 2 నటిస్తున్న సమయంలో ఐశ్వర్య రాయ్ అతని ప్రేమలో పడింది.2007 జనవరి 14 ఐష్ అభిషేక్ పెళ్లి చేసుకోబోతున్నట్టు అమితాబ్ ధృవీకరించారు. ఇక అదే ఏడాది ఏప్రిల్ 16న అమితాబ్ బచ్చన్ సొంతిల్లు ప్రతీక్షలో పరిమిత సంఖ్యలో వీరి వివాహం జరిగింది.2011 నవంబర్ 16న ఐష్ .. ఆరాధ్య అనే పాపకి జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత ఐష్ సినిమాలు తగ్గించారు.


ఫ్యామిలీ, కూతురుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఐష్‌.. సినిమాలు, అవార్డులు, ఎండార్స్‌మెంట్లు, కుటుంబ విషయాలు…ఇలా ఆమె తరచూ వార్తల్లో వ్యక్తిగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు…ఐశ్వర్యరాయ్ చుట్టూ పలు వివాదాలు కూడా ఉన్నాయి.ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న తర్వాత సినిమా రంగ ప్రవేశం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్ ప్రయాణం సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో ఎత్తు పల్లాలు ఆమె జీవితంలో ఉన్నాయి. ఆమెకు ఇంత పాపులారిటీ రావడానికి వివాదాలు కూడా కారణం అనే చెప్పాలి. ఐశ్వర్యకు, అత్త జయా బచ్చన్‌కు అస్సలు పడటం లేదని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భర్త అభిషేక్‌తో ఆమె విడాకులు తీసుకోబోతోందంటూ కూడా వార్తలు వినిపించాయి.కెరీర్ తొలినాళ్లలో ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్‌తో ఎఫైర్ అప్పట్లో హాట్ టాపిక్. వివేక్ ఒబేరాయ్ తో ప్రేమాయణం, పనామా కేసు, సోనమ్ కపూర్‌తో గొడవ, మనీషా కోయిరాలతో ఫైట్, ఓ సందర్భంలో షారూఖ్‌తోను గొడవ ఇలా ఆమె జీవితంలో అనుకొని సంఘటనలు కూడా ఎక్కువే..


మరింత సమాచారం తెలుసుకోండి: