అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన రంభ మరియు ఊర్వశి, మేనకల్లోంచి.. తప్పిపోయి, ఊర్వశి భూలోకానికి చేరిందా.?

అంటే నిజమే అనిపిస్తుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాని ఇలా చూస్తే. అంతటి అందం ఆమె సొంతం మరి.

అయితే, అందం ఒక్కటే వుంటే సరిపోదు కదా.. అదృష్టం కూడా సరిగా వుండాలి. ఆ ఒక్కటే కాస్త తక్కువయ్యింద ట ఊర్వశి రౌతెలాకి. అందుకే, అంతటి అందాల అపురూప సౌందర్యవతి అయినప్పటికీ, స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోతోందట ఊర్వశి రౌతెల!

ఇటీవలే 'ది లెజెండ్' అంటూ ప్రముఖ బిజినెస్ మేన్ శరవణన్‌ సినిమాలో హీరోయిన్‌ గా నటించి, కోట్లలో రెమ్యునరేషన్, విలువైన బహుమతులు పట్టేసిందట ఊర్వశి రౌతెలా.
ఆ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైపోయింది కూడా. ఇక, తాజాగా తెలుగు తెరపైనా ఊర్వశి తళుకు లు జిగేల్‌మని మెరిసే టైమొచ్చింది.

రామ్ పోతినేని, బోయపాటి శీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా లో ఊర్వశి రౌతెలా స్పెషల్ ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. రామ్‌ తో స్పెషల్‌గా స్టెప్పులేసేందు కు ఊర్వశి రౌతెలా రెడీ అవుతున్నట్లు కూడా ఇటీవలే కన్‌ఫామ్ అయ్యింది.

అన్నట్లు గతంలో నే ఊర్వశి రౌతెలా 'బ్లాక్ రోజ్' అనే సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా స్టేటస్ ఏంటో ఇంతవరకూ కూడా తెలీదు. కానీ, 'నా తప్పు ఏమున్నదబ్బా.' అంటూ సాగే ఆ సినిమాలో ని సాంగ్ మాత్రం తెగ ఫేమస్ అయిపోయిందిలే.!
తాజాగా రెడ్ హాట్ లుక్స్‌ లో ఊర్వశి రౌతెలా సోషల్ తెరని తన సొగసుల సునామీలో ముంచేసేందుకు సిద్ధమైందట.ఆ సునామీ లో కొట్టుకుపోవాలంటే, ఈ పిక్స్‌పై ఓ లుక్కేస్కోండి చూద్దాం.!ఈ రెడ్ డ్రెస్ లో తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది ఊర్వశి. సౌత్ లో తన అందానికి అందరూ కూడా తెగ ఫిదా అయిపోయారు. ఈమెకు సౌత్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: