మత్తెక్కించే కళ్లు.. మైమరిపించే సొగసు. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యా.. లేక ప్రాణం పోసుకున్న పాలరాతి శిల్పమా? అని ఆశ్చర్యపోయేంత అందం ఆమెకే సొంతం.

అందుకే ప్రపంచమంతా ఆమె అందానికి దాసోహమైంది. అందానికి కొత్త అర్థం చెప్పి అందరి మనసుల్ని కొల్లగొట్టింది. వయసు యాభైకి చేరువైనా ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటోంది ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఐశ్వర్యారాయ్.

1973 నవంబర్‌ 1న కర్ణాటక, మంగళూరులో జన్మించింది ఐశ్వర్య. 17ఏండ్లకే మోడలింగ్‌ రంగంలోకి అడుగు పెట్టింది. 1994లో తన అందంతో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఆమె.. ఆ తర్వాత అభినయంతో తన సత్తా చాటుకుంది. 1997లో మణిరత్నం దర్శత్వంలో తెరకెక్కిన 'ఇరువర్' అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిందట.ఆ సినిమానే 'ఇద్దరు' పేరుతో తెలుగులో డబ్ చేశారు. తన మొదటి తెలుగు సినిమా 'రావోయి చందమామ'. అందులో 'లవ్‌ టు లివ్' అనే పాటలో నటించిందట.

ఐశ్వర్య తన కెరియర్‌లో ఎక్కువగా బాలీవుడ్‌ మూవీల్లోనే నటించింది. హిందీ, తెలుగుతో పాటు తమిళ్, ఇంగ్లీష్, బెంగాలీ, కన్నడ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. విభిన్న పాత్రల్లో నటించిన ఐశ్వర్య, కోట్లాది అభిమానుల్ని కూడా సంపాదించుకుంది.

సినిమాల్లోనే కాదు కమర్షియల్ యాడ్‌ రంగంలో కూడా ఐశ్వర్యది అరుదైన రికార్డు. పెప్సీ యాడ్‌లో అమీర్‌ ఖాన్‌తో కలిసి నటించిన ఆమె.. పెప్సీ, కోకోకోలా, టైటాన్‌ వాచెస్‌ తదితర టాప్‌ కమర్షియల్ బ్రాండ్స్‌ ప్రమోట్ చేసిన వన్ అండ్ ఓన్సీ ఫిమేల్ ఇండియన్‌ మోడల్‌గా రికార్డు ను సృష్టించింది. ఇండియన్‌ యాక్ట్రెస్‌ల్లో ఇప్పటికీ బ్రాండ్ అంబాసిడర్‌లలో టాప్ లో కొనసాగుతోందట ఐశ్వర్య.

ఒక దశలో సల్మాన్ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌ తదితర బాలీవుడ్ టాప్‌ హీరోలతో సమానంగా ఐశ్వర్య రెమ్యూనరేషన్ కూడా తీసుకుంది. 'బ్రైడ్ అండ్ ప్రిజుడీస్' అనే హాలీవుడ్ మూవీలోనూ నటించింది. 2007 లో అభిషేక్‌ బచ్చన్‌ని పెండ్లాడి బచ్చన్ ఫ్యామిలీలో మెంబరైంది. పెండ్లయిన తర్వాత కూడా ఐష్ కెరీర్ వదులుకోలేదు. తన నటనకుగానూ ఆమె ఎన్నో జాతీయ అవార్డులు ను అందుకుంది. ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్‌గా రెండుసార్లు ఎంపికైంది. సినిమా రంగంలో ఆమె చేసిన కృషికి.. కేంద్ర ప్రభుత్వం 2010లో ఐశ్వర్యను పద్మశ్రీ అవార్డులో సత్కరించిందట .

కూతురు పుట్టాక చాలా ఏండ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఐశ్వర్య, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్‌'లో నటించి అందరినీ మెప్పించింది. రీసెంట్‌గా ఈ సినిమా తమిళ్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిందట..

మరింత సమాచారం తెలుసుకోండి: