తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  క్షణం ,  గూడాచారి , ఎవరు , మేజర్ మూవీ లతో వరుసగా హీరోగా విజయాలను అందుకుంటు ప్రస్తుతం అడవి శేషు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేషు "హిట్ ది సెకండ్ కేస్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. 

హిట్ ది సెకండ్ కేస్ మూవీ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా రూపొందుతుంది. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడంతో ప్రేక్షకులు హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే హిట్ ది సెకండ్ కేస్ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను నవంబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ కు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది.

హిట్ ది సెకండ్ కేస్ మూవీ టీజర్ ను రేపు అనగా నవంబర్ 3 వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ టీజర్ ను "ఏ ఎం బి"   సినిమాస్ స్క్రీన్ వన్ లో ఉదయం 10 గంటలకు ప్రసారం చేయనున్నట్లు కూడా చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: