తెలుగు బిగ్ బాస్ ఎన్నో వివాదాల మధ్య కొనసాగుతున్న సంగతి తెలిసిందే..ఒకవైపు షోను ఆపెయ్యాలని విమర్శలు అందుతున్నా కూడా యాజమాన్యం షోను మరింత రక్తి కట్టించే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు.హౌస్ మెట్స్ అసలు రంగు బయట పడుతుంది. ఒక్కొక్క వారం ఒక్కోలా ప్రవర్తిస్తూ తమ ఆటని మారుస్తూ వస్తున్న ఆట గాళ్లు ఎవరన్నది ఆడియన్స్ కనిపెట్టేస్తున్నారు.ఈ సీజన్ లో ఊసరవల్లిలా మారుతున్న కంటెస్టంట్ ఎవరు అంటే ఇంకెవరు ఇనయా సుల్తానా అని అంటున్నారు. మొదటి 3 వారాలు చిన్న చిన్న కారణాలకు కూడా హౌస్ మెట్స్ మీద గొడవకు దిగిన ఆమె ఆర్జే సూర్యతో క్లోజ్ ఆయ్యాక తన కోపాన్ని తగ్గించుకుంది. అయితే సూర్య అంటే ఇష్టంగా ఉంటూ అతన్ని నామినేట్ చేసి అతను హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి కారణం అయ్యింది.


ఇష్టపడిన అతన్నే వెళ్లాలని నామినేట్ చేయడం.. రేవంత్ తో సూర్య ఈ వీక్ వెళ్లిపోవాలని అనడం ఇనయా ఆడుతున్న డబుల్ గేం ని బయట పెట్టింది. ఇదే విషయాన్ని రేవంత్ నామినేషన్స్ టైం లో బయట పెడితే ఆమె సమాధానం చెప్పకుండా మళ్లీ ఎటాకింగ్ మోడ్ లో వెళ్లింది. ఎంతగా అంటే ఎక్కువమంది హౌస్ మెట్స్ తనని టార్గెట్ చేస్తుండగా ఇనయా బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ నేనే అంటూ ఎనౌన్స్ చేసుకుంటూ నానా రచ్చ చేసింది. ఇదంతా పక్కన పెడితే నామినేషన్స్ పూర్తి కాగానే వెళ్లి బాత్ రూం డోర్ వేసుకుని వెళ్లి బోరున ఏడ్చేసింది. ఆడియన్స్ లో తాను ఎక్కడ నెగటివ్ అవుతానో అని ఇనయా ఆడుతున్న ఈ డబుల్ గేం అందరికి అర్ధమైంది.


ఈ సీజన్ లో ఇనయానే డ్రామా క్వీన్ అని.. టైటిల్ గెలిచేందుకు ఆమె ఎవరితో అయినా క్లోజ్ గా ఉంటుంది.. ఎవరితో అయినా కయ్యానికి దిగుతుంది. ఇనయా ఆట తీరు అసలేమాత్రం ఆడియన్స్ ని నచ్చట్లేదు. ముఖ్యంగా సూర్యతో ఉంటూ సూర్య వెళ్లాలని కోరడం ఆమె మీద ఇప్పటివరకు ఉన్న కాస్త కూస్తో అభిమానం కూడా పోయింది. అందుకే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఇనయా దాదాపు ఎలిమినేట్ అవడం పక్కా అని అంటున్నారు. ఇనయా వెళ్తేనే హౌస్ లో కొద్దిగా ప్రశాంతత ఉంటుందని ఫీలయ్యే వారు కూడా ఉన్నారు. మరి ఈ డ్రామా క్వీన్ ని హౌస్ లో ఉంచుతారా లేక బయటకు పంపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: