ఇటీవల కాలంలో సినిమాలకు గ్యారెంటీ ఉండడం లేదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న సినిమాలే కాదు పెద్ద హీరోల పెద్ద దర్శకుల సినిమాలకు కూడా ఎటువంటి గ్యారెంటీ లేదు. ఆ విధంగా చాలా మంది పెద్ద హీరోల సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం, ఓకే అయిన తరువాత కూడా ఆ సినిమాలను హీరోలు చేయకపోవడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో ఈ సినిమా సెట్స్ పైకి త్వరలోనే వెళ్ళబోతుంది అని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పుష్ప రెండవ భాగం సినిమా కూడా మొదలు కాకపోవడం కథ విషయంలో ఎన్నో అనుమానాలు ఏర్పడుతున్నాయి అనే వార్తలు వినపడటం ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అన్న విధంగా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. 

పుష్ప మొదటి భాగం సినిమా సంచలన విజయం అందుకోవడంతో ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అందుకుంటుందో చూడాలి. ఈ నేపథ్యంలో ఈ రెండవ భాగంపై పెరిగిన అంచనాల దృష్ట్యా ఈ చిత్రం యొక్క కథను పూర్తిగా మార్చి వేశారు అందుకే ఈ సినిమా మొదలు పెట్టడానికి ఇంతటి సమయాన్ని తీసుకున్నాడు దర్శకుడు సుకుమార్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నవంబర్లో మొదలు కాబోతుంది అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ సినిమా మొదలు కాకపోవడం అభిమానులలో అసహనం నెలకొంటుంది. దాదాపు సంవత్సర కాలంగా అల్లు అర్జున్ ఖాళీగా ఉండడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని తెచ్చిపెట్టి అభిమానులను అలరిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా లో రష్మిక మండన హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే తొలి పార్ట్ ఆల్బం తో సూపర్ హిట్ కొట్ట్టిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఈ ఆల్బం తో ఎలాంటి విజయాన్ని అందుకుంతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: