తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ శౌర్య ఇప్పటికే ఈ సంవత్సరం కృష్ణ వ్రిందా విహారి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. కృష్ణ వ్రిందా విహారి మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాగ శౌర్య తాజాగా తన కెరియర్ లో 24 వ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రకటించాడు.  నాగ శౌర్య కెరియర్ లో 24 వ మూవీ గా తేరకేక్కబోయే మూవీ కి టైటిల్ ను మూవీ యూనిట్ ప్రకటించలేదు. దానితో ఈ మూవీ యూనిట్ ఈ మూవీ ని ఎన్ఎస్ 24 అనే టైటిల్ తో అధికారిక ప్రకటన చేసింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ అరుణాచలం రచన మరియు దర్శకత్వం వహించనున్నారు. 

వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ మూవీ ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ మూవీ ని సమర్పించనున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ను మేకర్స్ గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హారిస్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరి కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: