తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ సేన్ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే విశ్వక్ సేన్ కొంత కాలం క్రితం యాక్షన్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. ఈ పూజా కార్యక్రమాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇలా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ని ప్రారంభించడానికి విశ్వక్ సేన్ సహకరించడం లేదు అని తాజాగా అర్జున్ సర్జా మీడియా సమావేశంలో తెలియజేసిన విషయం మన అందరికీ తెలిసిందే.  షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నప్పటికీ విశ్వక్ సేన్ వాటికి రావడం లేదు అని అర్జున్ తెలియజేశాడు.

ఇది ఇలా ఉంటే అర్జున్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ స్పందించాడు. అర్జున్ గారికి క్షమాపణలు. నేను సినిమా మొత్తానికే చేయను అని చెప్పలేదు. కేవలం ఒక్క రోజు షూటింగ్ ఆపాలని మెసేజ్ పెట్టా. చర్చించుకున్నాక తర్వాతి రోజు చేద్దాం అన్నాను. సడన్ గా షూటింగ్ అపడం తప్పే. అర్జున్ గారు అవమానంగా భావిస్తే సారీ. నేను చేసిన సినిమా బాగుండాలని చేశా ... అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: