ప్రభాస్ హీరోగా  నటిస్తున్న ఆదిపురుష్  సినిమా 2023 జూన్ 16ని కొత్త డేట్ గా లాక్ చేస్తూ మూవీ యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది.పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యే సూచనలు ఇంకా అవ్వలేక లేకపోవడంతో ఇంకెక్కువ సమయం తీసుకుంటున్నారు. అసలు ఇన్ని పనులు పెట్టుకుని ఏ కాన్ఫిడెన్స్ తో జనవరి నెలలో రావాలని నిర్ణయించుకున్నారని అభిమానులు తిడుతున్నారు.అయితే టీజర్ లో వచ్చిన కంప్లైంట్స్ ని చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకున్న టి సిరీస్ టీం ఇప్పుడు ఆ రిపేర్ల కోసమే వంద కోట్ల దాకా అదనంగా ఖర్చు పెట్టబోతోందని సమాచారం తెలుస్తుంది.అయితే జూన్ 16 సమ్మర్ సీజన్ కావడంతో ఆ పరంగా చూసుకుంటే బెటరే కానీ ఓవర్ సీస్ కోణంలో చూసుకుంటే మాత్రం చాలా రిస్క్  ఉంది.


ఎందుకంటే ఆ నెల 2న స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్, 9న ట్రాన్స్ ఫార్మర్స్ రైజ్ అఫ్ ది బీస్ట్స్, 23న ది ఫ్లాష్ లు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా త్రీడి వెర్షన్లతో వస్తున్నవే. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకి డిస్ట్రిబ్యూటర్లు మెయిన్ స్క్రీన్లకు రెండు నుంచి నాలుగు వారాల కనీస అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. అలా జరిగితే యుఎస్ ఇంకా యుకె వంటి దేశాల్లో భారీ ప్లానింగ్ లో ఉన్న ఆది పురుష్ కి థియేటర్లు పెద్దగా దొరకవు.అలాంటప్పుడు లేనిపోని రిస్క్ అనేది చాలా అవుతుంది.ఇంకా వీటికి తోడు ప్రభాస్ మరో సినిమా సలార్ రిలీజ్ ని సెప్టెంబర్ నెలకి ఇది వరకే చెప్పేశారు. మరి దానికే కట్టుబడతారా లేక ఆది పురుష్ వస్తుందా లేదా చూసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటారా అనేది ఇక చూడాలి. ఏది ఏమైనా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడం వల్ల వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు ఇంకా తునివులకు మేలు చేసినట్టే. కానీ జూన్ లో రిలీజ్ మాత్రం కాస్త రిస్క్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: