చివరిగా మేజర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు తను నటించే సినిమాలన్నీ కూడా కాస్త విభిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. తాజాగా నటిస్తున్న చిత్రం హీట్ -2. ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తూ ఉన్నారు. స్టార్ హీరో నాని సమర్పిస్తున్నారు. రిలీజ్ కు విడుదలైన ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా చాలా వేగంగా చేస్తూ ఉన్నారు చిత్ర బృందం.

డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గానే ఇప్పుడు ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఊరికె ఊరికే అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ అని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఈ ప్రోమో మేకర్స్ విడుదల చేయక సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.


ఇక ఈ లిరికల్ వీడియోలో అడవి శేషు, మీనాక్షి చౌదరి ఘటన రొమాన్స్ తో కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాలు కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఇక ఈ వీడియో చూసిన అడవి శేషు అభిమానులు తమ హీరోలు ఇలాంటి యాంగిల్ ఉందా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీన విడుదలకు సిద్ధంగా ఉండడంతో మేకర్ ఈ సినిమా ప్రమోషన్స్ ను మరింత చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హీట్ -2 సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: