తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వారిలో లెజెండ్ నటుడు బ్రహ్మానందం అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని కూడా సంపాదించుకున్నారు. బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో సినిమాలలో కాస్త తక్కువగా కనిపించిన సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బ్రహ్మానందం కి సంబంధించి ఎక్స్ప్రెషన్స్ తో పలు మీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. తాజాగా బ్రహ్మానందం నాగబాబు కూతురు నిహారిక కలవడం జరిగింది. ఆమె ఎందుకు ఆయన కలిశారు అనే విషయం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారుతోంది.


ఇక నిహారిక ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఆయనతో సమయం గడపడం నాకు గొప్ప అనుభూతి అంటూ చెప్పుకోవడంతో పాటు గొప్ప వ్యక్తిని కలిశానని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది నిహారిక. ఇక ఆయన గురించి తన పోస్టుల పొగడ్తలతో ముంచేసింది ఇమే. బ్రహ్మానందం ఒక అద్భుతమైన స్టోరీ టెల్లర్గా నిహారిక పొగడ్తలతో ముంచేసింది. ప్రస్తుత ప్రపంచం గురించి కూడా ఆయన లోతైన విశ్లేషణ చేస్తూ అద్భుతంగా మాట్లాడుతారు అంటూ నిహారిక తెలియజేయడం జరిగింది. బ్రహ్మానందం గారు నటించిన రంగమార్తాండ చిత్రం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ తెలిపింది.



నిహారిక నటిగా ఈ మధ్య పెద్దగా కనిపించకపోయిన నిర్మాతగా వరుస ప్రాజెక్టులు చేస్తూ ఉంది. తాజాగా బ్రహ్మానందమును ఆమె ఒక నిర్మాతగా కలిసి ఉంటుంది అంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉన్నారు. త్వరలోనే నిహారిక నిర్మించబోయే వెబ్ సిరీస్ లేదా సినిమాలలో బ్రహ్మానందాన్ని నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చివరిలో మళ్లీ మళ్లీ కలుస్తామంటూ ఆమె ఇంటి ఇవ్వడంతో ఇది కేవలం వరకు ఉద్దేశం గానే నిహారిక బ్రహ్మానందం కలిసి ఉంటుందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: