చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోల్లో నాగార్జున- వెంకటేష్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇక వీరిద్దరూ ఇప్పటికీ కూడా హిట్ సినిమాలలో నటిస్తూ..ఇప్పటి తరం యువ హీరోలకి పోటీ ఇస్తున్నారు. వీరిద్దరూ బావ- మరదలు అన్న సంగతి తెలిసిందే. కాగా ఫ్యామిలీ ఆడియన్స్ లో వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక వీళ్ళు ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు.అయితే వీరు నటించిన సినిమాల గురించి చెప్పాలంటే అదొక పెద్ద లిస్ట్ అవుతుంది.ఇక  గతంలో దర్శకులు ఫ్యామిలీ సినిమాలు చేయాలనుకుంటే ముందుగా

 ఈ ఇద్దరి హీరోలు దగ్గరికే వచ్చేవారు.అయితే  ముందుగా ఏ దర్శకుడైన వెంకటేష్ దగ్గరికి వెళ్లేవారు.ఇకపోతే  ఈ క్రమంలోనే ఓ దర్శకుడు రెండు సార్లు ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథతో వెంకటేష్‌ను కలిశాడు.కాగా  రెండుసార్లు కూడా వెంకటేష్ నో చెప్పడంతో.. ఆదర్శకుడు ఆ సినిమాలను నాగార్జునతో తీశాడు. వెంకటేష్ తో చేయాలనుకున్న సినిమాలని నాగార్జునతో తీశాడు.ఇక అందులో ఒక సినిమా హిట్ అయింది.. ఇంకో సినిమా ఫ్లాఫ్ అయింది.ఇక ఆ సినిమాలలో ఒకటి సంతోషంమరో సినిమా గ్రీకు వీరుడు.అయితే  ఆ దర్శకుడు మరి ఎవరో కాదు దశరథ్ ఈ రెండు సినిమాలని వెంకటేష్ కోసం రాసుకున్నాడు దర్శకుడు.

 ఇక సంతోషం టైంలో వెంకటేష్ వసంతం- మల్లీశ్వరి సినిమాలతో బిజీగా ఉన్నాడు.అయితే  దీంతో సంతోషం సినిమాలో ఆయన నటించలేకపోయాడు.ఇకపోతే  అప్పుడు నాగార్జున ఈ సినిమాల్లో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే మళ్లీ గ్రీకువీరుడు కథ కూడా మొదట వెంకటేష్ వద్దకు వెళ్ళింది.కాగా దశరథ్ ఆ టైంలో మిస్టర్ పర్ఫెక్ట్ తో సూపర్ హిట్ అందుకుని.. వెంకటేష్ తో సినిమా చేద్దాం అనుకుంటే.. ఆ సమయంలో కూడా మసాలా- షాడో సినిమాలో బిజీగా ఉన్నాడు వెంకటేష్.. ఈ సినిమాను కూడా నాగార్జునతో దశరథ్ చేయాల్సి వచ్చింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా హిట్ అయిన రెండో సినిమా ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఇక ఈ విధంగా వెంకటేష్ తో చేయాలనుకున్న సినిమాలని నాగార్జునతో ఈ దర్శకుడు తీసుకోవాల్సి వచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: