టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది సాయికుమార్ "ప్రేమ కావాలి" మూవీ తో తెలుగు సినిమా ప్రేమికులను పలకరించింది. మొదటి మూవీ తో ఈ హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు. ప్రేమ కావాలి మూవీ లో ఇష చావ్లా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత లవ్లీ మూవీ లో ఆది సాయికుమార్ హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా రెండు మూవీ లతో , రెండు విజాయలను అందుకున్న ఈ హీరో , ఆ తర్వాత అనేక మూవీ లలో హీరోగా నటించాడు.

కానీ ఆ మూవీ లు ఏవి  ఈ హీరోకు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను తెచ్చిపెట్ట లేక పోయాయి. ఆది సాయికుమార్  హిట్ , ఫ్లాప్ ఏ మాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఆది సాయికుమార్ ఈ సంవత్సరం కూడా అనేక మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ లు కూడా ఈ హీరోకు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందించలేకపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది సాయికుమార్ "టాప్ గేర్" అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ ని ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌ నిర్మిస్తోంది. శశికాంత్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో ఆది సాయికుమార్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: