ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న కమీడియన్ లలో ఒకరు అయిన సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ నీ సంపాదించుకున్న సుదీర్ ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అయిన అనేక షో లకి యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుడిగాలి సుధీర్ టీవీ షో లలో పాల్గొంటూనే ,  వరస సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా సుధీర్ "గాలోడు" అనే మూవీ లో హీరో గా కూడా నటించాడు. ఈ మూవీ ని నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే రేంజ్ లో ఆదరణ లభిస్తుంది. మరి గాలోడు మూవీ తో సుడిగాలి సుదీర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే సుడిగాలి సుదీర్ మరియు మరియు జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మి ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సుడిగాలి సుదీర్ ఈ విషయంపై స్పందించాడు. స్కిట్ చేసినంత వరకే తమ మధ్య సరదా సంభాషణ ఉంటుంది అని , డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత కొన్ని సార్లు తమ మధ్య మాటలు కూడా ఉండేవి కాదు అని సుధీర్ చెప్పుకొచ్చాడు. తమది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే అని , పదేళ్ల నుంచి చెబుతున్నాను అని సుదీర్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: