ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని మూవీ లు థియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం ధియేటర్ లలో విడుదల కావడానికి రెడీ గా ఉన్నా సినిమాల వివరాలను తెలుసుకుందాం. అలిపిరికి అల్లంత దూరంలో ఈ మూవీ నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. దానితో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు. మసూద మూవీ నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది.

మూవీ హర్రర్ జోనర్ లో తెరకెక్కింది. ఇప్పటికే మసూద మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  అవి అద్భుతమైన రీతిలో ఉండడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సుడిగాలి సుదీర్ హీరోగా తెరకెక్కిన గాలోడు మూవీ నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే గాలోడు మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ తో సుడిగాలి సుదీర్ ఎ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

సీతారామపురంలో సినిమాను నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇలా ఈ వారం ఈ మూవీ లు థియేటర్ లలో విడుదల కానున్నాయి. ఈ సినిమా లలో హారర్ జోనర్ లో తెరకెక్కిన మసూధ మూవీ  పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లలో ఏ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: