మాస్ మహారాజా రవితేజ తాజాగా ధమాకా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో రవితేజ సరసం శ్రీ లీల హీరోయిన్ గ నటించగా ,  సినిమా చూపిస్త మామ , నేను లోకల్ , హలో గురు ప్రేమకోసమే మూవీ లకు దర్శకత్వం వహించిన త్రినాథ్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల చేసింది.

ఈ ప్రచార చిత్రాలకు , పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రవితేజ క్యారట్రైజేషన్  చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ధమాకా మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ధమాకా మూవీ "ఓ టి టి" హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటి వరకు ఈ న్యూస్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రవితేజ ఈ సంవత్సరం ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేకపోయాయి. మరి ఈ సంవత్సరం రవితేజ నటిస్తున్న మూడవ సినిమా ధమాకా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: