ఒక సినిమా విజయం సాధించాలంటే దాని వెనుక ఎంతో మంది కృషి దాగి ఉంటుంది. కథ బాగుండాలి, నటీనటుల నుండి సరైన నటనను డైరెక్టర్ రాబట్టుకోగలగాలి, డైలాగ్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ , సినిమాకు అవసరం అయిన బడ్జెట్ ను నిర్మాత అందించాలి. ఇలా పైన చెప్పుకున్న అన్ని అంశాలు చక్కగా కుదిరితేనే ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమాను ప్రేక్షకులకు వెళుతుంది. కరోనా తర్వాత ఒక ప్రేక్షకుడికి సినిమాను ఏ కోణం నుండి చూడాలి అన్న అవగాహన వచ్చింది. అందుకే పెద్ద పెద్ద బడ్జెట్ , భారీ తారాగణంతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్లాప్ లుగా మిగిలిపోయాయి. అందుకే ప్రేక్షకులకు నచ్చే విధంగా కొత్త కథలను తీసుకురావడం డైరెక్టర్లు మొదలెట్టారు.

ఇప్పటి వరకు కొత్త డైరెక్టర్లు కొత్త కథలను తెరకెక్కించి విజయాలను అందుకున్నారు. అటువంటి ఒక పరభాష సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి దానికి అయిదు రెట్లు కలెక్షన్ లను సాధించి సౌత్ సినిమా పరిశ్రమలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ మధ్యనే మలయాళంలో "జయ జయ జయ జయహే" అనే పేరుతో ఒక సినిమా విడుదలైంది. ఒక చిన్న కథను అద్భుతమైన స్క్రీన్ ప్లే మరియు నటనతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు దర్శకుడు విపిన్ దాస్. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్ , దర్శన రాజేంద్రన్ మరియు అజు వర్గీస్ లు నటించి సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించారు.

కథలోకి వెళితే భర్త భార్యను చీటికిమాటికి కొట్టడం మరియు దానిని భార్య ఎంతవరకు భరించింది... చివరకు భర్తపై ఎదురుతిరిగితే భర్త రియాక్షన్ ఏంటి అన్న కథాంశాన్ని అల్లుకుని సృష్టిచిన సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది అని చెప్పాలి. ఎంతలా అంటే 5 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం అయితే... 25 కోట్ల కలెక్షన్ లను సాధించి చిన్న సినిమాలకు రోల్ మోడల్ గా నిలిచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: