దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కొంత కాలం క్రితమే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు ,  తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి , భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో ఆలియా భట్ ,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా , ఒలీవియా మోరిస్మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది. అజయ్ దేవగన్ ,  శ్రేయ ,  సముద్ర ఖని ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ని కొన్ని రోజుల క్రితమే జపాన్ లో భారీ ఎత్తున విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి జపాన్ లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ జపాన్ లో విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ప్రస్తుతం కూడా ఈ మూవీ జపాన్ లో అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది. జపాన్ లో ఇప్పటివరకు ఈ మూవీ సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఆర్ ఆర్ ఆర్ మూవీ 1.38 లక్షల డాలర్స్ ని ఈ నాలుగో వీకెండ్ లో వసూలు చేయగా ,  దీనితో ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో 14 కోట్ల మార్క్ కి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికీ అయితే జపాన్ లో సూపర్ హోల్డ్ ను కొనసాగుతున్న ఈ మూవీ ఫైనల్ రన్ లో జపాన్ లో  ఎన్నో కోట్ల కలెక్షన్ లను సాధిస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: