తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ సీనియర్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ను తెచ్చుకున్న కమల్ హాసన్ తాజాగా విక్రమ్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.  చాలా సంవత్సరాలుగా సరైన విజయం లేని కమల్ హాసన్ విక్రమ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు కూడా లభించాయి.  

మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా , ఫహద్ ఫజిల్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. సూర్యమూవీ లో గెస్ట్ రోల్ లో నటించగా , ఈ మూవీ లో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ విజయంలో విజయ్ సేతుపతి నటన కూడా కీలకపాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ మరియు విజయ్ సేతుపతి మరో సారి మరో మూవీ లో కలిసి నటించ బోతున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో కమల్ హాసన్ మరియు విజయ్ సేతుపతి మరో సారి కలిసి నటించబోతున్నట్లు ఒక వార్త కోలీవుడ్ మీడియాలో తెగ చేక్కర్లు కొడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హెచ్ వినోద్ , అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తునీవు మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని 2023 వ సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: