దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన తొలి సినిమా నుంచి కూడా ప్రతి సినిమాలో ఎంట ర్టైన్మెంట్ పాలు కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి సినిమాలను చేసే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్న నేపథ్యంలో అనిల్ రావిపూడి తో సినిమా చేయాలని చాలా ఎక్కువ మంది హీరోలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈసారి బాలకృష్ణతో సినిమా చేస్తూ ఉండడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపెడుతుంది.

ఆయన గతంలో చేసిన ఎఫ్ 3 సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే సినిమా ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. అయితే బాలకృష్ణతో సీరియస్ టైప్ సినిమాలు అయితేనే వర్కౌట్ అవుతాయని కామెడీ సినిమాలు చేస్తే పెద్దగా వర్కౌట్ అవ్వవు అని ఆయనకు సలహాలు సూచనలు చేస్తున్నారు కొంతమంది సినిమా విశ్లేషకులు. అది పట్టించుకోకుండా అనిల్ రావిపూడి తన గత సినిమాల తరహాలోని సినిమాలు చేస్తే తప్పకుండా చేదు అనుభవాన్ని ఎదుర్కొంటాడని వారు హెచ్చరిస్తున్నారు

ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే కథను రెడీ చేసి బాలకృష్ణకు చెప్పి ఓకే చేసిన నేపథ్యంలో ఆయన ఎటువంటి సినిమాను బాలకృష్ణతో చేస్తాడో చూడాలి. ఆయన గత రెండు సినిమాలు అఖండ మరియు వీరసింహారెడ్డి చిత్రాలు భారీ యాక్షన్ సినిమాలే కాగా ఈ చిత్రం ఏవిధంగా ఉంటుందో తెలియాలి అంటే ఈ సినిమా మొదలయ్యేంత వరకు ఆగాల్సిందే. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నారు అంటున్నారు. మరి సినిమాలు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోని అనిల్ రావిపూడి ఏవిధంగా ఈ సినిమా ను చేస్తాడో చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: