ఇటీవలే పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న నయనతార సినిమాల పరంగా కూడా ఏమాత్రం అలసత్వం చూపించడం లేదు. ఒకవైపు తన జీవితంలో ముందడుగులు వేస్తూనే ఇంకొక వైపు సినిమా పరిశ్రమలో ఆమె వరుస సినిమాలు చేస్తూ వాటిని విడుదలకు సిద్ధం చేస్తుంది. తాజాగా ఒక హర్రర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి ఆమె సిద్దమయింది.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ గా మంచి పేరు సంపాదించుకున్న నయనతార కు మంచి మార్కెట్ ఉంది. దక్షిణ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతూ ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెడుతున్న ఈ ముద్దుగుమ్మ లేడి ఓరియంటెడ్ సినిమాలకు ఎంతో కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇప్పటివరకు చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలను విడుదల చేసి విజయాలను అందుకోగా అన్ని భాషలలో మార్కెటును ఏర్పాటు చేసుకొని భారీ స్థాయిలో పారితోషకాన్ని అందుకుంటూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు నటించిన సినిమా విడుదల కావడానికి సిద్ధమయ్యింది. హారర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది అని ఆమె భావిస్తుంది. వెరైటీ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుంది అని ఇప్పటికే విడుదలైన పోస్టర్లను బట్టి తెలుస్తుంది. మరి తొందరగా దీనిపై ఓ క్లారిటీ ఇస్తే మంచిది. ఇక ఆమె నటిస్తున్న మరొక సినిమా బాలీవుడ్ లో సరసన జవాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ద్వారా అక్కడ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుందో చూడాలి.  అయితే ఈమె పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలు చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. చాలామంది హీరోయిన్ లు పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తారు. అలా కాకుండా నయన సినిమాలు చేయడం ఒకవైపు ఆనందంగా ఇంకోవైపు ఆశ్చర్యంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: