ఈ మధ్య కాలం లో పెళ్ళయిన సెలెబ్రేటిలు విడాకులు తీసుకుంటూన్నారన్న వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందకు కారణాలు కూడా లేకపోలేదు.. మొన్నటివరకు సమంత నాగచైతన్య తో ఎందుకు విడి పోయారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు నిఖిల్ కూడా విడాకుల కు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిఖిల్, ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఆయన నటించిన రీసెంట్ మూవీ కార్తికేయ-2 ఇండియన్ బాక్సాఫీస్‌ ను షేక్ చేసి, వసూళ్ల వర్షం కురిపించింది.


సినిమా ఇచ్చిన సక్సెస్‌ తో నిఖిల్ టాలీవుడ్ నుండి ఇండియా వైడ్ హీరోగా గుర్తింపు ను తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాల ను తెరకెక్కిస్తూ బిజీగా మారాడు నిఖిల్. అయితే తాజాగా, నిఖిల్‌ కు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నిఖిల్ తన భార్య పల్లవి తో విడాకు లకు సిద్ధమవుతున్నట్లు గా ఫిలింనగర్‌ లో వార్తలు షికారు చేస్తున్నాయి. కాగా, ఈ వార్తల పై నిఖిల్ ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో ఈ వార్తలు నిజమే కాబోలు అంటూ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. దీంతో తాజాగా నిఖిల్ ఈ వార్తలపై తనదైన స్టయిల్‌లో రెస్పాన్స్ ఇచ్చాడు..


తన భార్యతో కలిసి ఉన్న ఫోటో ను షేర్ చేస్తూ..''మనమిద్దరం కలిసున్న ప్రతి క్షణం అద్భుతమే'' అంటూ కామెంట్ చేశాడు. గోవా లో తన భార్యతో వెకేషన్‌ లో ఉన్నట్లుగా ఈ ఫోటోను చూస్తే అర్థమవుతోంది. దీంతో నిఖిల్ తన భార్యకు విడాకులు ఇస్తున్నాడనే వార్త కేవలం పుకారేనని తేలిపోయింది. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయా అని నిఖిల్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కాగా ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ-3 సినిమా లో నటించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: