మహేష్ బాబు నటించిన నేనొక్కడినే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఇక తర్వాత నాగచైతన్యత దోచేసి సినిమా లో నటించింది. ఇక తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు అడుగులు వేయగా అక్కడ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ఆదిపురష్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే అంతకంటే ముందు తోడేలు అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది ఈ ముద్దుగుమ్మ .వరుణ్ ధావన్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా ఈ చిత్రంలో నటించారు.


అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఈ చిత్రం నవంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తెలుగులో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ ను హైదరాబాదులో నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ.. నేనొక్కడినే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాను ఆ సినిమాకి మహేష్ బాబు నాకు ఎంతో సహకరించారు. ఆయన మంచి వ్యక్తి అని తెలియజేసింది.. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు తోడేలు చిత్రంతో తెలుగువారిని అలరించేందుకు సిద్ధమయ్యారని తెలిపింది.


ఈ చిత్రాన్ని కూడా మీరు అందరూ ప్రేమిస్తారనుకుంటున్నానని తెలిపింది. దీంతో అక్కడే స్టేజ్ మీద మరొక పాటకు డాన్స్ వేసి అదరగొట్టింది. ఆ తర్వాత అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెబుతూ తెలుగులో తన ఆదిపురేష్ కో స్టార్ ప్రభాస్ అంటే తనకెంతో ఇష్టమని తెలియజేసింది. తెలుగులో పుష్ప మరియు rrr సినిమాలు చాలా బాగా నచ్చాయని తెలియజేసింది. తెలుగు సినిమాతో తన కెరియర్ మొదలయ్యింది ఆదిపురష్ సినిమా షూటింగ్ అప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే నటిగా తొలి అడుగులు వేసిన రోజులు గుర్తుకు వచ్చాయని తెలియజేసింది. ఆది పురుష్ సినిమా విడుదల కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: