తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులను ఒకరు అయినటు వంటి వెంకటేష్ మహా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటేష్ మహా "కేర్ ఆఫ్ కంచరపాలెం" మూవీ తో దర్శకుడి గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన కేరాఫ్ కంచరపాలెం మూవీ విడుదల అయిన తర్వాత ఇటు ప్రేక్షకుల నుండి , అటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. కేరాఫ్ కంచరపాలెం మూవీ తో వెంకటేష్ మహా క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ యువ దర్శకుడు సత్య దేవ్ హీరోగా తెరకెక్కిన ఉమా పరమేశ్వర ఉగ్రరూపస్య అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ఉమా పరమేశ్వర ఉగ్రరూపస్య సినిమా వచ్చి చాలా కాలమే అవుతున్న ఈ దర్శకుడు ఇప్పటి వరకు తన తదుపరి మూవీ కి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ యువ దర్శకుడు తాజాగా గోపీచంద్ కు ఒక కథను వినిపించినట్లు , ఆ కథ బాగా నచ్చిన గోపీచంద్ ఈ దర్శకుడు తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరి కొన్ని రోజుల్లోనే ఈ కాంబినేషన్  మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: