ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు "క్షణం" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత గూఢచారి మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అలాగే ఎవరు , మేజర్ మూవీ లతో కూడా అడవి శేషు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకున్నాడు. 

ఇలా సోలో గా వరుసగా నాలుగు మూవీ లతో , నాలుగు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అడవి శేషు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా అడవి శేషు , శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ కి సీక్వెల్ గా రూపొందించబడింది. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి అడవి శేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం అడవి శేషు వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అడివి శేషు మాట్లాడుతూ ... డిసెంబర్ 2 వ తేదీ తర్వాత ... హిట్ ది సెకండ్ కేస్ మూవీ విడుదల అయిన తర్వాత గూడాచారి 2 మూవీ కోసం కథను రాయడం ప్రారంభిస్తాను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: