మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ , రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ మూవీ లో హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా , అంజలి , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూ వీకి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో , ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ తెరకెక్కిస్తోంది.  ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్ తన మూవీ లలో పాటలను ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తాడో మన అందరికీ తెలిసిందే. శంకర్ మూవీ లోని పాటలు చూడడానికే కొంత మంది ప్రత్యేకంగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శంకర్ , రామ్ చరణ్ మూవీ లోని సాంగ్స్ ను కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.  ఈ మూవీ షూటింగ్  న్యూజిలాండ్ లో ఈ రోజు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ లోని అద్భుతమైన ప్రదేశాలలో దర్శకుడు శంకర్ , రామ్ చరణ్ మరియు కియరా అద్వానీ ల మధ్య ఒక అద్భుతమైన సాంగ్ ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని సన్నివేశాలను కూడా న్యూజిలాండ్ లో మూవీ యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: