టాలీవుడ్ హీరో న్యాచురల్  స్టార్  నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన హిట్ సినిమా ఫస్ట్ కేస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో దానికి కొనసాగింపుగా ఇప్పుడు సెకండ్ టాలెంటెడ్  హీరో అడివి శేష్  హీరోగా కేస్ హిట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.డిసెంబర్ 2వ తేదీన ఈ మూవీని భారీ స్థాయిలోని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు తరువాత కొనసాగింపుగా మరిన్ని కథలు ముందుకు వెళతాయి అని దర్శకుడు ఇంతకుముందే క్లారిటీ ఇచ్చాడు.ఇక ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే హిట్ మూడవ కేసులో మొత్తం ముగ్గురు స్టార్స్ నటిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఎవరు పాజిటివ్ రోల్స్ ఎవరు నెగిటివ్ రోల్స్ అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ తప్పకుండా ముగ్గురు పవర్ఫుల్ హీరోస్ కనిపించబోయే అవకాశం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది.


ముఖ్యంగా టాలెంటెడ్ హీరో అడవి శేష్ అయితే మూడవ కేసులో కూడా కనిపించబోతున్నాడు. మేజర్ సినిమాతో అడివి శేష్ కూడా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే అడివి శేష్ కూడా టాలీవుడ్ పెద్ద హీరోల్లో ఒకడిగా నిలవడం ఖాయం.అడివి శేష్ తో పాటు నాని కూడా అందులో ఒక పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరో తమిళ హీరో విజయ్ సేతుపతిని కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. క్యారెక్టర్ బలంగా ఉంటే విజయ్ సేతుపతి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అని అస్సలు చూడడు. కంటెంట్ బాగుంటే అతను సినిమా చేయడానికి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అది విలన్ పాత్ర అయినా కూడా విజయ్ ఇష్టంగానే చేస్తాడు. కానీ హిట్ 3 కథ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఇక హిట్ 2 ట్రైలర్ ని రేపు విడుదల చెయ్యనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: