బాలీవుడ్ అంటే ఐటమ్ సాంగ్స్, చెవులు చిల్లడిపోయే డిస్కో మ్యూజిక్, అమ్మాయిలను అసభ్యంగా చూపించే బికినీ సీన్స్, విచ్చలవిడిగా వుండే రొమాంటిక్ సీన్స్.. ఇవే ఎక్కువగా గుర్తొస్తాయి. ఎప్పుడో దశాబ్దానికి కానీ మంచి కంటెంట్ సినిమాలు రావు. వీళ్ళు పాటలు, సెక్స్ సీన్స్ మీద పెట్టిన శ్రద్ధ, బడ్జెట్ కంటెంట్ మీద పెట్టరు. అందుకే బాలీవుడ్ పతనం అయ్యింది. అందుకే కొద్దిగా ఛాన్స్ దొరికినా కూడా నెటిజన్స్ బాలీవుడ్ ని ఓ రేంజిలో ఆడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా నెటిజన్స్ అస్సలు వదలడం లేదు.ఆది మాములు సినిమా అయితే అనుకోవచ్చు.. కానీ అది రామాయణం కథ.. పైగా 500 కోట్ల బడ్జెట్.. అందులోనూ ప్రభాస్ వంటి బిగ్ పాన్ ఇండియా స్టార్.. అంచనాలు అనేవి మినిమమ్ ఉంటాయి. కానీ ఆ అంచనాలే తల కిందులు అయితే ఎలా ఉంటుంది? బండ బూతులు తిట్టరు. అదే ఇప్పుడు ఈ సినిమా విషయంలో జరుగుతుంది..రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపిస్తుండడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. సరే అభిమానులు ఎదురుచూస్తున్నారు కదా అని టీజర్ శాంపిల్ విసిరి ట్రోలర్స్ కు పనిచెప్పాడు డైరెక్టర్.


అస్సలు క్వాలిటీ లేని విజువల్ ఎఫెక్ట్స్ ఉండడం ఏమిటి అని అమీర్ పెట్ లో వెయ్యి రూపాయలకు కూడా ఇలాంటి గ్రాఫిక్స్ చేయరు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇదేదో చిన్న పిల్లలు చూసే కార్టూన్ సినిమాల ఉందని, బాలీవుడ్ శుద్ధ వేస్ట్ అని ట్రెండ్ చేశారు. ఇక కొద్దిరోజులకు ఈ ట్రోల్స్ క్రమంగా తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. అందుకు ప్రధాన కారణం తెలుగులో హనుమాన్ టీజర్ రిలీజ్ అవ్వడమే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ, అమ్రితా అయ్యర్ జంటగా నటించిన ఈ సినిమా టీజర్ ను  మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా విజువల్స్ అయితే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. హాలీవుడ్ రేంజ్ లో టీజర్ ఉంది అంటే అసలు అతిశయోక్తి కాదు. కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా విజువల్స్ 500 కోట్ల రూపాయిలతో నిర్మితమవుతున్న ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ విజువల్స్ కంటే కూడా ఎంతో అత్యద్భుతంగా ఉన్నాయి. టాలీవుడ్ కేవలం ఒక రెండు సినిమాల అనుభవం వున్న కుర్ర డైరెక్టర్ అంత మంచి విజువల్స్ ను అందించాడు.. టాలీవుడ్ ను చూసి నేర్చుకో బాలీవుడ్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ రెండు టీజర్లను పక్కపక్కన పెట్టి మరి ఒక రేంజిలో ఆడేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: