తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటు వంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి , ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు తమిళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న లవ్ టుడే మూవీ ని తెలుగులో విడుదల చేయనున్నాడు. నవంబర్ 4 వ తేదీన తమిళ భాషలో విడుదల అయ్యి  బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న లవ్ టుడే మూవీ ని దిల్ రాజు తెలుగు లో నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నాడు.

లవ్ టుడే మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. లవ్ టుడే మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు "మసుద" మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. మసుద మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా దిల్ రాజు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా దిల్ రాజు "మసుద" మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ... దిల్ రాజు మూవీ లను తొక్కేస్తాడు అని నామీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నాకు ఇంకో సైడ్ కూడా ఉంది అది. అది ఎవరికి తెలియదు. సినిమాను ప్రేమించి మంచి కంటెంట్ తో సినిమాలు తీసే వాళ్ల కోసం నేను ఏది చేయడానికి అయినా రెడీ.  

ఒక అద్భుతమైన మూవీ మనవాళ్లకు చూపిద్దాం అని ఇప్పుడు లవ్ టు డే మూవీ ని రిలీజ్ చేస్తున్నా , దాంట్లో నాకు ఒక్క రూపాయి కూడా మిగలదు. కానీ మూవీ మీద ఉన్న ఫ్యాషన్ తో ఆ మూవీ ని రిలీజ్ చేస్తున్న , డబ్బులు వద్దు నాకు , ఏం చేసుకుంటాం డబ్బులతో. వారిసు థియేటర్స్ ఇష్యూ గురించి త్వరలో సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరుగుతుందో వివరిస్తా అని తాజాగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: