నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం బాలకృష్ణ "అఖండ" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇది వరకు ఎన్నో సార్లు బాలకృష్ణ కుమారుడు అయినటువంటి మోక్షాజ్ఞ ను సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ అనేక వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై గోవా ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ స్పందించాడు.

తాజాగా బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి స్పందిస్తూ ... మోక్షజ్ఞ ను వచ్చే సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించాడు. డైరెక్టర్ ఎవరు అనేది చెప్పలేము అని బాలకృష్ణ తెలియజేశాడు. ఇలా ఉంటే బాలకృష్ణ మరి కొన్ని రోజుల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో హీరోగా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: