మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృతి సనన్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

అందులో భాగంగా అనేక క్రేజీ బాలీవుడ్ మూవీ లలో అవకాశాలను దక్కించుకోవడం మాత్రమే కాకుండా , కృతి సనన్ నటించిన బాలీవుడ్ సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడం తో ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం కృతి సనన్ ,  ప్రభాస్ హీరో గా తెరకెక్కిన ఆది పురుష్ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా కృతి సనన్ "తోడేలు" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తోడేలు మూవీ ప్రమోషన్ లలో భాగంగా కృతి సనన్ మాట్లాడుతూ  సుకుమార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. మహేష్ బాబు తో 1 నేనొక్కడినే మూవీ లో సుకుమార్ పేజీల పేజీల డైలాగ్ లను ఇచ్చారు అని , తెలుగు వచ్చిన మహేష్ బాబు కు మాత్రం కొన్ని డైలాగ్ లను మాత్రమే ఇచ్చాడు అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: