
తాజాగా సంగీత "మసుద" అనే హర్రర్ జోనర్ లో తెరకెక్కిన మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది. ఈ మూవీ ని దిల్ రాజు విడుదల చేశాడు. ప్రదీప్ రంగనాథన్ తాజాగా లవ్ టుడే అనే తమిళ మూవీ లో హీరో గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ్ లో నవంబర్ 4 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని తెలుగు లో దిల్ రాజు నవంబర్ 18 వ తేదీన విడుదల చేశాడు. ఈ మూవీ కూడా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని లాభాలను అందుకుంటుంది. ఇలా వరుసగా రెండు మూవీ లతో దిల్ రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను అందుకున్నాడు.