టాలీవుడ్ లో ఒక చిన్న హీరో గా అడుగు పెట్టిన అడవి శేషు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరో గా పేరు దక్కించుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన తో సినిమా నిర్మించినా.నాచురల్ స్టార్ నాని ఆయన ను హీరోగా పెట్టి సినిమా ను నిర్మించినా.. పెద్ద దర్శకులు ఆయన కు కథలు చెప్పేందుకు పరుగులు పెడుతున్నా.. ఆయన మాత్రం చాలా సింపుల్ సిటీ గా అనిపిస్తాడు. సోషల్ మీడియా లో ఎప్పుడూ కూడా హడావిడి చేయని అడవి శేషు తన సినిమా విడుదల సమయం లో మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలు బాధ్యత చూసుకుంటాడు. అంతే కాకుండా సినిమా యొక్క నిర్మాణ వ్యవహారం లో కూడా బాధ్యత ను నెత్తిన వేసుకుంటాడు. దర్శకుడి కి కాస్త ఆయన పని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

ఆ విషయం పక్కన పెడితే కథల ఎంపిక విషయం లో శేష్ ది బెస్ట్ అన్నట్లుగా పేరు దక్కించుకున్నాడు. ఈ సంవత్సరం అడవి శేష్ కి రెండు కమర్షియల్ బ్లాక్ బస్టర్ లు దక్కాయి. మేజర్ సినిమా ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ నమోదు చేసింది. 100 కోట్ల కు పైగా వసూలు నమోదు చేసిన ఆ సినిమా తర్వాత హిట్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని నిర్మించిన ఈ సినిమా కు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.

సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి చెబుతూ వచ్చారు. కానీ కొందరు మాత్రం ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అడవి శేష్ మినిమం గ్యారంటీ హీరో అన్న పేరు దక్కించుకున్నాడు. ఇక నుండి అడవి శేషు ఏ సినిమా చేసిన కూడా అది మినిమంగా ఆడుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే ఆయన తో సినిమాలు నిర్మించేందుకు.. తెరకెక్కించేందుకు దర్శకులు నిర్మాతలు ముందుకు రాబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: